CM KCR : వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం రివ్యూ

వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

CM KCR : వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం రివ్యూ

Cm Kcr

CM KCR : తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు పడుతున్నాయి. వాగులు పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. వరదనీరు పోటెత్తడంతో… ఊళ్ల మధ్య కనెక్షన్ కూడా కట్టయిపోయిన పరిస్థితి. అనేక గ్రామాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణాల్లోని కాలనీలు, రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. వరద నీటి తరలింపు చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. తెలంగాణలో వానలు, వరద పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.