CM KCR Mallanna Sagar : దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ- కేసీఆర్

దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.

CM KCR Mallanna Sagar : దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ- కేసీఆర్

Kcr Mallanna Sagar

CM KCR Mallanna Sagar : తెలంగాణ‌లోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ప‌రిగ‌ణిస్తున్న కాళేశ్వ‌రంలో మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద జ‌లాశ‌యం మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ను తెలంగాణ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. సిద్ధిపేట జిల్లా తొగుట మండ‌లం తుక్కాపూర్ దగ్గర నిర్మిత‌మైన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. కేసీఆర్ మీట నొక్క‌గానే.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి గోదావ‌రి జ‌లాలు ప‌‌ర‌వళ్లు తొక్కాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. తెలంగాణకు కరువు రాదన్న సీఎం కేసీఆర్

ఏడేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉండే ఇప్పుడెలా ఉంది? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో ఉన్న పరిస్థితులేంటి? తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటని అడిగారు. పంజాబ్‌తో పోటీ పడుతూ మన ధాన్యం పండిస్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతులు కాలర్‌ ఎగరేసి బతుకుతున్నారు అని కేసీఆర్ అన్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కరణ అవుతోందని హర్షం వ్యక్తం చేశారు. మత్స్యపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతోందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధిలో ముందున్నాం అని అన్నారు.

 

దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని, మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టం అని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. అయితే, కొందరు దుర్మార్గులు కాళేశ్వరాన్ని ఆపేందుకు స్టే తెచ్చారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు 600 పైచిలుకు కేసులు వేశారని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్లామని వెల్లడించారు. మంత్రి హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. చాలా నిబద్ధతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ నిర్మించామని తెలిపారు. పూర్తి అవినీతి రహితంగా మల్లన్నసాగర్‌ నిర్మించుకున్నాం అన్నారు. తెలంగాణ జల చరిత్ర సాగరం.. మల్లన్నసాగర్ అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సమస్యను తీర్చేదన్నారు. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా మల్లన్నసాగర్‌ నిర్మాణం చేపట్టామన్నారు. 20లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకుని కాపాడే ప్రాజెక్టు ఇదని చెప్పారు.

”భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పరిహారం ఇచ్చాం. ఇంకా ఎవరైనా ఉంటూ వారికీ పరిహారం అందించాలి. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగాలని కోరుకోను. పాలమూరు జిల్లాలోనూ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి.
తెలంగాణకు కరువు రాకుండా ప్రాజెక్టే కాళేశ్వరం. దేశానికి కరువు వచ్చినా.. తెలంగాణలో మాత్రం రాదు. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటుంది?. దేవాదుల పాజెక్టునూ కంప్లీట్‌ చేసుకున్నాం” అని కేసీఆర్ అన్నారు.

Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద జ‌లాశ‌యంగా నిర్మిత‌మైన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌లో ఏకంగా 58 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవ‌కాశం ఉంది. ఈ జ‌లాశ‌యం నుంచి ఏకంగా 15.70 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అంద‌నుంది. ఉత్త‌ర తెలంగాణ‌కే కాకుండా ద‌క్షిణ తెలంగాణ‌కు కూడా మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ర ప్ర‌సాదినిగా మార‌నుంది. జ‌లాశ‌యంలో 8 పంపుల‌ను ఏర్పాటు చేయ‌గా.. వీటిలో ఒక్కో పంపు సామ‌ర్థ్యం 43 మెగావాట్లు.