Telangana Lockdown : లాక్‌డౌన్ పొడిగిస్తారా..? రాత్రి కర్ఫ్యూతో సరిపెడతారా..?

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.

Telangana Lockdown : లాక్‌డౌన్ పొడిగిస్తారా..? రాత్రి కర్ఫ్యూతో సరిపెడతారా..?

Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారా? లేక మరికొన్ని ఆంక్షలు సడలిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ విధిస్తారా? అన్నది కేబినెట్ మీటింగ్ లో తేలనుంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సడలింపులు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల 9 నుంచి లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే దానిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. మంగళవారం కేబినెట్ సమావేశంలో అన్ లాక్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మినహాయింపులు ఇచ్చి నైట్ కర్ఫ్యూ కొనసాగించే అవకాశముంది. అదే సమయంలో మరో వారం పాటు ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలన్న సూచనలూ వస్తున్నాయి. దీంతో ఆ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

కాగా, తెలంగాణలో లకా్ డౌన్ ను మరింత సడలించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. ఎల్లుండి(జూన్ 9,2021) నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే చాన్స్ కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు వెసులుబాుట కల్పించింది. అదే సమయంలో లాక్ డౌన్ తొలగించి నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలూ ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల గణనీయంగా తగ్గింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97వేల 751 మందికి టెస్టులు చేయగా.. 1,436 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక 24 గంటల్లో రాష్ట్రం వ్యాప్తంగా 3వేల 614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 27,016 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు చాలామంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.85 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57శాతం ఉంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,91,170 మంది కరోనా బారిన పడగా.. 5,60,776 మంది కోలుకున్నారు. కరోనాతో 3వేల 378 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు 1,58,61,242 శాంపిల్స్ పరీక్షించారు.