CM Mamata Banarjee : పానీ పూరీ అమ్మిన దీదీ..ఎగబడిన జనాలు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మమతా బెనర్జీ చాయ్ తాజాగా డార్జిలింగ్ లో పానీ పూరీ అమ్ముతూ కనిపించారు.

CM Mamata Banarjee : పానీ పూరీ అమ్మిన దీదీ..ఎగబడిన జనాలు

mamata banerjee serves paani puri  : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. బెంగాల్ లో కనీవినీ ఎరుగని రీతిలో ఓడిపోయి కూడా సీఎం అయ్యారు మమతా బెనర్జీ. పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మమతా బెనర్జీ చాయ్ తాజాగా డార్జిలింగ్ లో పానీ పూరీ అమ్ముతూ కనిపించారు. మూడు రోజుల పాటు డార్జిలింగ్ లో పర్యటిస్తున్న సందర్భంగా దీదీ పానీ పూరీ అమ్మారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనటానికి హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన మూడ్రోజుల పాటు కొనసాగనుంది.

ఈక్రమంలో దీదీ డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ అమ్మారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.

కాగా గతంలో కూడా దీదీ చాయ్ షాపుకు వెళ్లి చాయ్ అమ్మారు.ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ దిఘాలోని దత్తాపూర్ పూర్ లో ఉన్న ఓ చిన్న టీ దుకాణం దగ్గర ఆమె ఆగారు. కారు దిగి షాపుకెళ్లిన మమతా ఆ షాపు యజమానితో మాట్లాడారు. తర్వాత స్వయంగా టీ పెట్టి తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. మమత ఉదాసీనతను చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

మమత అక్కడ ఉన్నారనే వార్త తెలుసుకుని భారీ సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో, పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా అక్కడకు చేరుకుంది. అయితే… సెక్యూరిటీని రావద్దని చెప్పిన దీదీ… అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..దీదీ చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని తెలిపారు.