Bihar: ఎన్నికల వేళ తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీని నెరవేర్చనున్న నితీశ్ కుమార్

2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీని నితీశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు లేవని, ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు హామీలు ఇస్తున్నారని నితీశ్ అన్నారు.

Bihar: ఎన్నికల వేళ తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీని నెరవేర్చనున్న నితీశ్ కుమార్

CM Nitish announced 10 lakhs jobs says tejashwi

Bihar: 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో ఈ హామీని తప్పు పట్టిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాజాగా దానిని నెరవేర్చేందుకు సిద్ధమవ్వడం విశేషం. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ ప్రకటన కూడా చేశారని తేజస్వీ అన్నారు. వీటికి అనుగుణంగా మరో 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తేజస్వీ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి కలయికలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఇరు పార్టీలు ఇచ్చిన హామీలపై ఇరు నాయకులు బాధ్యత వహించాల్సి వస్తోంది.

అయితే 2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీని నితీశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు లేవని, ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు హామీలు ఇస్తున్నారని నితీశ్ అన్నారు. అలాంటిది తేజస్వీతో చేతులు కలిపి వారం కూడా కాకముందే ఆర్జేడీ హామీపై ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం.

సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తేజస్వీ స్పందిస్తూ ‘‘పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య వేడుకల ఉద్దేశించిన ప్రసంగించిన గౌరవనీయమైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చారిత్రక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా మరో 10 లక్షల ఉద్యోగాల కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

పాట్నాలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు మేం కలిసి ఉన్నాం. కనీసం 10 లక్షల ఉద్యోగాలైనా భర్తీ చేయాలన్నది మా లక్ష్యం. అయితే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే.. యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పనపై మేం ప్రధానంగా దృష్టి పెట్టాము. ఇందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. ఇక ఈ ప్రసంగంలో తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి నితీశ్ ప్రముఖంగా చెప్పుకొచ్చారు.

Rahul quit on Modi comments: మోదీ వారసత్వ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించిన రాహుల్ గాంధీ