Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు..సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్‌ కాస్ట్‌లో షిఫ్ట్‌ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్‌కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్‌లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు..సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Coal Mone

Bhadradri Kothagudem : హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు.. పెనుబల్లి మండలంలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వి.ఎం బంజర్‌లో రహదారులపై వర్షపు నీరు పోటెత్తింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లంకసాగర్‌ ప్రాజెక్టు, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తింది.

Rain Warning : తెలంగాణ జిల్లాలకు రెయిన్‌ వార్నింగ్‌..భారీ నుంచి అతి భారీ వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకే ఓపెన్‌ కాస్ట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్‌ కాస్ట్‌లో షిఫ్ట్‌ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్‌కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్‌లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

సత్తుపల్లి ఓపెన్ కాస్ట్‌లో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇతర ప్రాంతాల్లోని సింగరేణి అండర్‌ గ్రౌండ్ మైన్‌లలోకి కార్మికులు వెళ్లడం కష్టంగా మారడంతో, బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని అధికారులు అన్నారు.