కోకా కోలా నుంచి ఫస్ట్ పేపర్ బాటిల్ వచ్చేస్తుంది!!

కోకా కోలా నుంచి ఫస్ట్ పేపర్ బాటిల్ వచ్చేస్తుంది!!

Coca Cola:ప్రముఖ కూల్ డ్రింక్స్ ఉత్పత్తి చేసే కంపెనీ.. కోకాకోలా పేపర్ బాటిల్ రిలీజ్ చేయనుంది. పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదించే పనిలో భాగంగా.. ప్యాకేజింగ్ మొత్తం పేపర్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రోటోటైప్ ను దనిశ్ కంపెనీ.. ఎక్స్‌ట్రా స్ట్రాంగ్ పేపర్ నుంచి తయారుచేస్తుండగా.. ఇందులో సన్నపాటి ప్లాస్టిక్ లైనర్ ఉపయోగిస్తున్నారు.

కానీ, వారి లక్ష్యమేమిటంటే.. 100శాతం రీసైకిలేబుల్, ప్లాస్టిక్ ఫ్రీ బాటిల్ తయారుచేయడమే. దానికి తగ్గట్టు కార్బొనేటెడ్ డ్రింక్స్ లో ఉండే గ్యాస్ ను తట్టుకుని ఉండే పేపర్ బాటిల్స్ రెడీ చేయాల్సి ఉంటుంది. లిక్విడ్ లో కలిసిపోకుండా ఉండటానికి ఫైబర్ లు అస్సలు వాడటం లేదు. అలా జరిగితే టేస్ట్ మారిపోవడంతో పాటు.. హెల్త్ పరంగా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

కానీ, ఇండస్ట్రీ దిగ్గజాలు.. అలా జరగకుండా ఉండటానికి 2030నాటికల్లా జీరో వేస్టేజ్ తో కోకాకోలా ఉత్పత్తులు రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఫిజ్జీ డ్రింక్స్, కోలా, బీర్ లాంటి ప్రొడక్ట్స్ ప్రెజర్ తో బాటిల్ లో ఉంచాలి. బాటిల్ షేప్ లో తయారుచేసి పైన మూత పెట్టి మూసేలా ఏర్పాటు చేయాలి. పైగా డిఫరెంట్ బ్రాండ్స్ ను బట్టి పలు రకాలుగా మోడల్స్ తయారుచేయాలి.

దీనిపై ఏడేళ్ల పాటు ల్యాబ్ వర్క్ చేసి.. ఈ ట్రయల్ వేయడం కోసం సిద్ధమవుతున్నారు. టెస్టింగ్ దశ లో భాగంగా.. 2వేల బాటిల్స్ ను లోకల్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.