Coconut Oil : జుట్టు, చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె

చలి కాలంలో పొడి చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొబ్బరి నూనె చర్మంలో తేమను నింపుతుంది. ముఖం కడుక్కోవడానికి కొన్ని నిమిషాల ముందు.. కొబ్బరి నూనె రుద్దుకొని మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కుంటే చాలు..

Coconut Oil : జుట్టు, చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె

Coconut Oil

Coconut Oil : జుట్టునే కాదు.. చర్మాన్ని అద్భుతంగా మార్చడంలో కొబ్బరినూనెకు ఏదీ సాటి రాదని చాలా మందికి తెలియదు.కొబ్బరి మనకు ప్రకృతి అందించిన వరం. రోజూ మన ఇంట్లోనే ఉండే ఈ కొబ్బరి నూనెతో మన చర్మాన్ని, జుట్టును అందంగా మార్చుకోవచ్చు.జుట్టు చాలా రఫ్‌గా.. దువ్వడానికి కూడా ఇబ్బందిగా అనిపించేలా ఉంటే.. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అది సిల్కీగా మారుతుంది. తలస్నానానికి ముందు తలకు నూనె రాసుకోవడం వల్ల.. జుట్టు సిల్కీగా మారడంతో పాటు బలంగా కూడా తయారవుతుంది.

కొబ్బరి నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసుకోవడం వల్ల.. జుట్టు మరింత నల్లగా మారడంతో పాటు మెరుస్తూ ఉంటుంది.కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లలో ఫంగస్ పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. దీనికోసం ఆర్గానిక్ కొబ్బరి నూనెను రెండు మూడు టీస్పూన్లు తీసుకొని.. కాస్త వేడి చేసి కుదుళ్లకు అప్లై చేసుకుంటే సరిపోతుంది.హెయిర్ కండిషనర్స్‌లో కొబ్బరి నూనె ఉంటుంది. ఎందుకంటే ఇది జుట్టు ప్రతి వెంట్రుక కుదుళ్ల లోపలికి వెళ్లిపోయి జుట్టును కండిషన్ చేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. జుట్టు కుదుళ్లకు కొబ్బరినూనెను బాగా పట్టించి.. వేడి నీటిలో ముంచిన టవల్‌తో జుట్టును చుట్టి.. గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

చలి కాలంలో పొడి చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొబ్బరి నూనె చర్మంలో తేమను నింపుతుంది. ముఖం కడుక్కోవడానికి కొన్ని నిమిషాల ముందు.. కొబ్బరి నూనె రుద్దుకొని మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కుంటే చాలు.. చర్మం అందంగా మెరిసిపోతుంది. కొబ్బరినూనెను స్క్రబ్బర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఒక కప్పులో రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్‌ చక్కెర వేయాలి. అది కూడా కాఫీ షాప్స్‌లో వాడే అతి చిన్న స్పటికాలుండే చక్కెర తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపాక.. ఆ మిశ్రమానికి ముఖానికి స్క్రబ్బర్‌లా పట్టించుకుని కడిగేయాలి. చర్మంలో మెరుపు వస్తుంది.

అర టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాను ఒక కప్పులో తీసుకుని మెత్తగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక మైల్డ్‌ సబ్బుతో ముఖాన్ని కడిగేయాలి. ఇలానే ఒక కప్పులో రెండు టీస్పూన్ల కొబ్బరినూనె తీసుకోవాలి. ఇందులోకి నాలుగు టీ స్పూన్ల అలొవెరా జెల్‌ను మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమల నివారణ కోసం ఎక్కువగా ఉపయోగించే బెంజోయిల్ పెరాక్సైడ్ కంటే.. కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అంతేకాదు.. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. పెదాలు పగిలినప్పుడు కూడా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా దీన్ని లిప్ బామ్ మాదిరిగా వాడాలి. లేదా లిప్ గ్లాస్ కోసం మీ పాత లిప్ స్టిక్‌లో కొబ్బరినూనె కలిపి.. ఓ డబ్బాలో నింపి పెట్టుకుంటే.. అటు మాయిశ్చరైజేషన్‌తో పాటు ఇటు మెరుపు కూడా మీ సొంతమవుతుంది.