Health : కాఫీ v/s చాక్లెట్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

30 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 20mg కెఫిన్ ఉంటుంది, అయితే సగటు కప్పు కాఫీలో సుమారు 80 నుండి 155 mg కెఫిన్ ఉంటుంది. రెండింటిని సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

Health : కాఫీ v/s చాక్లెట్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Chocolate, Cofee

Health : మనలో చాలా మంది తమ రోజు వారి దినచర్యను ఒక కప్పు కాఫీతో ప్రారంభించి, డార్క్ చాక్లెట్ ముక్కతో ముగిస్తారు. సాధారణంగా కాఫీని వ్యసనంగా , చాక్లెట్ ను జంక్ ఫుడ్ అభివర్ణిస్తారు. అయితే ఈ రెండిటివల్ల కొన్ని ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీ, చాక్లెట్ లలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అలాగే కెఫిన్ కూడా ఉంటుంది. 30 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 20mg కెఫిన్ ఉంటుంది, అయితే సగటు కప్పు కాఫీలో సుమారు 80 నుండి 155 mg కెఫిన్ ఉంటుంది. రెండింటిని సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మం, జుట్టుకు మితమైన డార్క్ చాక్లెట్ తినడం, కాఫీ తాగడం వల్ల ఆరోగ్య కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు ;

కాఫీ తాగటం వల్ల కొన్ని వ్యాధుల ప్రమాదం నుండి బయటపడవచ్చు. పోషకాహార నిపుణులు చెబుతున్న దానిని బట్టి కాఫీలోని అధిక కెఫిన్ శక్తి స్ధాయిలు మెరుగుపరుస్తాయి. మానసిక పనితీరుతోపాటు, మెదడు పనితీరును తదితర అంశాలపై కాఫీ ప్రభావం చూపుతుంది. కాఫీలో విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, పొటాషియం, ఉంటాయి. కాలేయం దెబ్బతినకుండా కాఫీ తోడ్పడుతుంది. కాఫీలో పాలీఫెనాల్స్ అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. వృద్ధాప్య సంకేతాలకు ఇది యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది.

చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలు ;

డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ మరియు కొన్ని ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇన్ని ఉన్నప్పటికీ చాక్లెట్ లో అధిక మొత్తంలో ఉండే చక్కె, క్రీమ్, శుద్ధి చేసిన పిండి, కొవ్వులు ఆరోగ్యంపై కొంతమేర చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అదే క్రమంలో చాక్లెట్ తినంటం వల్ల మంచి కొలెస్ట్రాల్ , ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగటంతోపాటు, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో మాదిరిగానే చాక్లెట్ లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చాక్లెట్ ధమనులలో రక్త ప్రవాహాన్ని సరిచేసి గుండెపోటు రాకుండా చేస్తుంది. మెదడులో రక్తప్రవాహన్ని సక్రమంగా ఉండేలా చూస్తుంది.డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడం, చర్మ సాంద్రతను పెంచడం, చర్మాన్ని తేమగా ఉంచటం, ఎండవేడి నుండి చర్మాన్ని దెబ్బతినకుండా రక్షించడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి.