Cold Intensity Hike : తెలంగాణ పెరుగుతున్న చలి తీవ్రత.. కుమ్రంభీం జిల్లాలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తోంది.

Cold Intensity Hike : తెలంగాణ పెరుగుతున్న చలి తీవ్రత.. కుమ్రంభీం జిల్లాలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

cold intensity hike : తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి.

రాష్ట్రంలోనే కుమ్రంభీం జిల్లాలో 8 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌లో 9.6 డిగ్రీలు, మంచిర్యాలలో 10.1 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరుకున్నాయి.

Weather Report: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి పులి

సిద్దిపేట జిల్లా దుల్మిట్టలో 10.9 డిగ్రీలు, మెదక్‌ జిల్లా నార్లపల్లిలో 13 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 13.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.