Nama Nageswara Rao: మధుకాన్‌ కంపెనీలపై ముగిసిన ఈడీ సోదాలు!

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసం, కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై కూపీ లాగిన ఈడీ అధికారులు.. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి శనివారం ఉదయం 4 వరకు మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

Nama Nageswara Rao: మధుకాన్‌ కంపెనీలపై ముగిసిన ఈడీ సోదాలు!

మదుకాన్ కంపెనీలపై ముగిసిన ఈడీ సోదాలు!

Nama Nageswara Rao: టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసం, కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై కూపీ లాగిన ఈడీ అధికారులు.. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి శనివారం ఉదయం 4 వరకు మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో నామాకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్స్ ను, లాకర్స్ ను గుర్తించిన ఈడీ అధికారులు.. నామా ఇంట్లో బ్యాంకుల్లో భారీ నగదు గుర్తించినట్టు సమాచారం.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, రోడ్‌ నం.36లో ఉన్న మధుకాన్‌ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది.

ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈ తనిఖీలు నిర్వహించింది. ఆదివారం సాయంత్రం ఈ సోదాలకు సంబంధించి ఈడీ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.