Sonia Gandhi: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.

Sonia Gandhi: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

Sonia Gandhi

Sonia Gandhi: కరోనా సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి నుంచి 10 జన్‌పథ్‌లో ఉన్న తన నివాసానికి సోనియా చేరుకున్నారు. ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

దాదాపు తొమ్మిది రోజులపాటు అక్కడ చికిత్స తీసుకున్నారు. తాజాగా సోనియా డిశ్చార్జ్ అయినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు సోనియా మరికొంత కాలం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకునే వరకు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. మరోవైపు ఈ నెల 23న సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ సోనియా గాంధీని విచారించాల్సి ఉంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ విచారణ కొనసాగుతోంది. తాజాగా సోనియా అనారోగ్యం దృష్ట్యా ఈడీ విచారణకు హాజరుకాకపోవచ్చు.