Digvijaya Singh: పోలీసు అధికారి కాల‌ర్ ప‌ట్టుకున్న దిగ్విజ‌య్ సింగ్.. వీడియో

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాల‌రు ప‌ట్టుకుని నెట్టేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్ర‌భుత్వ ఒత్తిడి మేర‌కు వారికి అనుకూలంగా ప‌నిచేశారని నిర‌స‌న తెలుపుతూ భోపాల్‌లోని జిల్లా పంచాయ‌తీ కార్యాలయానికి దిగ్విజ‌య్ సింగ్, ఎమ్మెల్యే అరీఫ్ మ‌సూద్, ఇత‌ర‌ కాంగ్రెస్ నేత‌లు చేరుకున్నారు. బోగ‌స్ ఓటింగ్‌పై ఆందోళ‌న తెలిపారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Digvijaya Singh: పోలీసు అధికారి కాల‌ర్ ప‌ట్టుకున్న దిగ్విజ‌య్ సింగ్.. వీడియో

Digvijay

Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాల‌రు ప‌ట్టుకుని నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్ర‌భుత్వ ఒత్తిడి మేర‌కు వారికి అనుకూలంగా ప‌నిచేశారని నిర‌స‌న తెలుపుతూ భోపాల్‌లోని జిల్లా పంచాయ‌తీ కార్యాలయానికి దిగ్విజ‌య్ సింగ్, ఎమ్మెల్యే అరీఫ్ మ‌సూద్, ఇత‌ర‌ కాంగ్రెస్ నేత‌లు చేరుకున్నారు. బోగ‌స్ ఓటింగ్‌పై ఆందోళ‌న తెలిపారు.

ఈ నేప‌థ్యంలో కార్యాల‌యంలోని చొచ్చుకుపోవ‌డానికి కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో పోలీసులు, దిగ్విజ‌య్ సింగ్‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి కాల‌ర్ ప‌ట్టుకుని ఆయ‌న‌ను దిగ్విజ‌య్ సింగ్ వెన‌క‌కు నెట్టేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పోలీసు అధిరాకి కాల‌ర్‌ను దిగ్విజ‌య్ సింగ్ ప‌ట్టుకోవ‌డంపై ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నేత ఇటువంటి తీరును ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాద‌ని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పోలీసు కాల‌ర్‌ను ప‌ట్టుకుని, అరుస్తూ, క‌లెక్ట‌రేట్ గేటు వ‌ద్ద దిగ్విజ‌య్ సింగ్ దౌర్జ‌న్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు.

Rohit Sharma: నెట్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ