Bengaluru-Mysuru Expressway: నా సమాధి కోసం కాంగ్రెస్ కలలు కంటోంది.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మైసూరు నుంచి వందేభారత్ రైలును సైతం ప్రారంభించారు.

Bengaluru-Mysuru Expressway: నా సమాధి కోసం కాంగ్రెస్ కలలు కంటోంది.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

modi

Bengaluru-Mysuru Expressway: తనకు సమాధి తవ్వాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ.. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను పట్టించుకోనని, తాను తాను దేశంలో రోడ్లను నిర్మించే పనిలో ఉన్నానని అన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు-మైసూరు మధ్య నిర్మించిన ఎక్స్‭ప్రెస్‭వేని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కర్ణాటక అభివృద్ధి మరింత ఊపందుకుందని మోదీ అన్నారు.

Viral Video: గుజరాత్ జానపద గాయకుడు పాడిన పాటకు పరవశించిపోయి నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు

ఇక బెంగళూరు-మైసూర్ ఎక్స్‭ప్రెస్‭వే గురించి మోదీ స్పందిస్తూ ‘‘కొద్ది రోజులుగా దేశమంతా ఈ ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు షేర్ చేస్తూ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు స్థాయిని చాలా పెంచారు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీ మాత్రం మోదీకి సమాధి తవ్వాలని చూస్తోంది. ఆ పనిలో వారు చాలా బిజీగా ఉన్నారు. కానీ నేను పేదలకు మంచి భవిష్యత్తును అందించే పనిలో బిజీగా ఉన్నాను. ప్రజల నమ్మకమే నాకు బహుమానం. కర్ణాటకను అభివృద్ధి వైపుకు తీసుకెళ్లె పనిలో బిజీగా ఉన్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు.

బెంగళూరు-మైసూర్ ఎక్స్‭ప్రెస్‭వే, దక్షిణ భారత దేశంలో నిర్మించిన మొట్టమొదటి ఎక్స్‭ప్రెస్‭వే. ఈ రోడ్డు ద్వారా బెంగళూరు-మైసూరు మధ్య 3 గంటల ప్రయాణం, 75 నిమిషాలకు తగ్గుతుందని అంటున్నారు. ఇంతకు ముందే ఉన్న ఎన్‭హెచ్-278 రోడ్డుని ఇలా ఎక్స్‭ప్రెస్‭వేగా తీర్చి దిద్దారు. ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం చేశారు. దీనికి 8,480 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోదీకి పార్టీ శ్రేణుల నుంచి, మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది.

మాండ్యాలో అడుగుపెట్టగానే అక్కడి నుంచి సుమారు 1.2 కిలోమీటర్ల మేర రోడ్డంతా కాషాయ జెండాలతో నింపివేశారు. మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మైసూరు నుంచి వందేభారత్ రైలును సైతం ప్రారంభించారు.