Dasoju Sravan : మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి చీకోటి అనుచరుడు- దాసోజు శ్రవణ్

మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ అనుచరుడు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కొండపాక బ్యాంక్ లాకర్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ కు సంబంధించి మనీ లాండరింగ్ పత్రాల సూట్ కేసులు దాచిపెట్టారని ఆరోపించారు. సీసీ కెమెరాలు బంద్ చేసి మరీ బ్యాంకులోకి వెళ్లి లాకర్ లో సూట్ కేసు భద్రపరిచారని చెప్పారు.

Dasoju Sravan : మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి చీకోటి అనుచరుడు- దాసోజు శ్రవణ్

Dasoju Sravan

Dasoju Sravan : మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ అనుచరుడు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కొండపాక బ్యాంక్ లాకర్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ కు సంబంధించి మనీ లాండరింగ్ పత్రాల సూట్ కేసులు దాచిపెట్టారని ఆరోపించారు.

సీసీ కెమెరాలు బంద్ చేసి మరీ బ్యాంకులోకి వెళ్లి లాకర్ లో సూట్ కేసు భద్రపరిచారని చెప్పారు. మరో సూట్ కేసును కొండపాక టీఆర్ఎస్ నేత ఇంట్లో దాచారని అన్నారు. ఈడీ అధికారులు కొండపాక బ్యాంకులో సోదాలు చేసి సూట్ కేసులు స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ ప్రస్థానం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని అధికారులు విచారించారు. ఈ అంశంలో జరిగిన లావాదేవీలపై ప్రవీణ్‌తో పాటు బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విదేశాల్లో జరిగిన క్యాసినో దందాలో జరిగిన హవాలా లావాదేవీలపై ఆరా తీసిన్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు అడిగిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ప్రవీణ్‌ వారికి అందజేసినట్లు సమాచారం.

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

నేపాల్‌, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్‌ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన అభియోగం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్‌ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.