Sonia Gandhi : నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియా

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ విచారించింది. నేషనల్‌ హెరాల్డ్‌ స్కామ్‌ కేసులో ఆమెను రెండు గంటలకుపైగా విచారించింది. ఇవాళ మరోసారి సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.

Sonia Gandhi : నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియా

Sonia Gandhi

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ విచారించింది. నేషనల్‌ హెరాల్డ్‌ స్కామ్‌ కేసులో ఆమెను రెండు గంటలకుపైగా విచారించింది. ఇవాళ మరోసారి సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. నేషనల్‌ హెరాల్డ్‌ ముద్రించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు ఉన్న రూ.90కోట్ల అప్పును యంగ్‌ ఇండియాకు బదలాయించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశముంది. యంగ్‌ ఇండియా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరుగా ఉన్న సోనియాకు 38శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపైనా కూపీ లాగనున్నారు.

గ‌త నెలలోనే విచార‌ణ‌కు రావాలంటూ సోనియాకు ఈడీ సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆమె విచారణకు హాజరుకాలేదు. మూడు వారాల సమయం కావాలని, ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని ఈడీకి సోనియా తెలిపారు. దీంతో ఈడీ అధికారులు 21న విచారించారు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆ రోజే స్పష్టం చేశారు. దీంతో ఇవాళ మరోసారి ఆమెను విచారించనున్నారు.

Sonia Gandhi: మొదటిరోజు ముగిసిన సోనియా గాంధీ విచారణ.. మళ్లీ సోమవారం హాజరుకావాలన్న ఈడీ

సోనియాగాంధీ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండడంతో కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. శాంతియుతంగా సత్యాగ్రహం నిర్వహించాలని అన్ని రాష్ట్ర యూనిట్లను కోరింది. ఢిల్లీలో నిర్వహించనున్న సత్యాగ్రహంలో పాల్గొనాలని ఎంపీలు, ఏఐసీసీ సభ్యులను కాంగ్రెస్‌ కోరింది.