V. Hanumantha Rao : పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ వేసినందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? ..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళుతున్నారనే వార్తలపై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు..‘పాలు..పెరుగులపై కూడా జీఎస్టీ వేశారని బీజేపీలోకి వెళుతున్నారా? అంటూ ప్రశ్నించారు.

V. Hanumantha Rao : పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ వేసినందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? ..

V.hanumantha Rao Serious About Komati Reddy Rajagopal Reddy

V. Hanumantha Rao : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు దుమారం రేపుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కాషాయ కండువా కప్పుకోబోతున్నారు అనేది పక్కా అనే వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో మునుగోడు దుమారం రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రంగంలోకి దిగారు.

Also read : V. Hanumantha Rao : స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఈక్రమంలో కాంగ్రెస్ అన్నా..సోనియా కుటుంబం అన్నా విపరీతమైన గౌరవాభిమానులు చూపే కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళుతున్నారనే వార్తలపై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిపై వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. ‘పాలు..పెరుగులపై కూడా జీఎస్టీ వేశారని బీజేపీలోకి వెళుతున్నారా? అంటూ ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. తమ్ముడు బీజేపీలోకి వెళ్లటంపై అన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎందుకు స్పందించటంలేదు..పార్టీకి నష్టమని తెలియదా? వెంటనే స్పందించి తమ్ముడికి నచ్చ చెప్పుకోవాలి అంటూ వీహెచ్ సూచించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకిలోకి వెళితే ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీకి కూడా ఇబ్బందే అనే విషయాన్ని గుర్తించటంలేదని సూచించారు.

Also read : Komatireddy RajGopal Reddy : కుట్ర జరుగుతోంది.. బీజేపీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్లారిటీ

పార్టీ మారటానికి అన్నిరకాలుగా సిద్ధం చేసుకోవటానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత అమిత్ షాను కలవటం చాలా పెద్ద తప్పు అన్నారు వీహెచ్. స్వతంత్ర్యంగా వ్యవహరించాల్సిన ఈడీ,సీబీఐలో మోడీ..అమిత్ షాల చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయని..ఇటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరటం ఎంతవరకు సమంజం అంటూ వీహెచ్ బీజేపీని విమర్శిస్తూనే కోమటిరెడ్డికి చురకలు వేశారు.రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై మునుగోడు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీ మారవద్దని తాను ఆయన ఇంటికి వెళ్లి పదే పదే నచ్చ చెప్పానని అయినా వినటంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఆశించిన సీఎల్పీ రాలేదని అసంతృప్తిగా ఉన్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని..కానీ రాజగోపాల్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదు అని మరోసారి ఆలోచించుకోవాలని వీహెచ్ సూచించారు.

Also read : Komatireddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌

అలాగే మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి బీజేపీకి వెళ్లే క్రమంలో చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వదిలి బీజేపీకి వెళుతూ విశ్వేశ్వర రెడ్డి ‘కాంగ్రెస్ చచ్చిపోయింది’అంటూ వ్యాఖ్యానించారని..ఈ మాటలు తనను తీవ్రంగా బాధించాయని ఇది చాలా అవమానకరమైన వ్యాఖ్యలు అంటూ వాపోయారు.