V. Hanumantha Rao : స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతారనే వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

V. Hanumantha Rao  : స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Vh Comments On Komatireddy Rajagopal Reddy's Party Change

V. Hanumantha Rao : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం. దీంతో ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడియో కాషాయ కండువా కప్పుకోవటం దాదాపు ఖరారు అయిపోయింది.

గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ ను వీడటంపై సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంటకరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టీని వదలి వెళ్లిపోతుంటే ఇక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం ఏముంటుంది? ఎటువంటి అనుమానాలు కలుగుతాయో అని ఆలోచింకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు.

నల్లగొండ అంటేనే కాంగ్రెస్ అంటారు. అటువంటిది నల్లగొండ కాంగ్రెస్ లో లుకలుకలు వచ్చి ఇలా పార్టీని వీడి వెళ్లిపోతే ఎలా ఇంతకాలం పదవులు ఇచ్చినపార్టీకి నష్టం కలిగించి వెళ్లిపోవటం సరికాదంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమాక్క స్పందించాలని సూచించారు. అలా రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంటకరెడ్డి కూడా స్పందించి తమ్ముడికి నచ్చ చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేనని..ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టిని వీడితే నలుగురు ఎమ్మెల్యేలే ఉంటారు అంటూ వాపోయారు వీహెచ్.