Jagga Reddy On OU : రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీకి.. ఇదేనా బహుమతి? జగ్గారెడ్డి

రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)

Jagga Reddy On OU : రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీకి.. ఇదేనా బహుమతి? జగ్గారెడ్డి

Jagga Reddy On Ou

Jagga Reddy On OU : ఉస్మానియా యూనివ‌ర్సిటీలో రాహుల్ గాంధీ స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి నిరాకరిస్తూ ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ శ‌నివారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఓయూలో బహిరంగ సభలకు కూడా అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాంపస్ లోకి కెమెరాలను నిషేధిస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ వచ్చాకే యూనివర్సిటీలు వీసీలు లేకుండా కొనసాగాయని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో మరెప్పుడూ లేదన్నారు. విధిలేని పరిస్థితిలో ఈ మధ్యే వీసీలను వేశారని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని జగ్గారెడ్డి చెప్పారు. ఓయూలో రాహుల్ గాంధీ సభ కోసం వీసీకి పెట్టుకున్న విజ్ఞప్తిని తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీకి ఇదేనా బహుమతి? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటనపై కొందరు పనికిరాని వాళ్లు చెత్త మాటలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.(Jagga Reddy On OU)

Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు

రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ఓయూలో లేని నిబంధనలు.. కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిబంధనలా..? సిగ్గుపడాలి అని జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఓయూకు ఎందుకు వెళ్లలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు… సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. విద్యార్థుల కోపానికి భయపడే ఓయూకు వెళ్లడం లేదన్నారు. ఓయూకు వెళ్లలేని పిరికిపందలు అని నిందించారు. ఓయూ రాహుల్ విజిట్ విషయంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ పర్యటనకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని.. వరంగల్‌ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నేతలతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు.(Jagga Reddy On OU)

MLA Jaggareddy : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాగా, రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మే 6, 7వ తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మే 6 న వరంగల్ లో రైతు సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మే 7 న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. పర్యటనలో భాగంగా ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఓయూ వీసీని అనుమతి కోరింది. అయితే ఇప్పటివరకు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతులు రాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

కాగా, తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌ గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రేపాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగానే స్పందించారు. బాల్క సుమన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాల్క సుమన్ వ్యవహారాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నీకు పదవి వచ్చి ఉండేదా? అని బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.