Telangana : భూ నిర్వాసితుల కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరాహార దీక్ష

భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

Telangana : భూ నిర్వాసితుల కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరాహార  దీక్ష

Congress MP Komatireddy Venkata Reddy hunger strike

Telangana : భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. తను చేయబోయే దీక్ష గురించి వెంకట రెడ్డి మాట్లాడుతూ..భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని వారి కోసం 72 గంటల దీక్ష చేస్తానని తెలిపారు.బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని..బాధిత రైతులకు మద్దతుగా బండ రావిరాల చౌరస్తాలో 72 గంటలు దీక్ష చేస్తానని..దీంట్లో భాగంగా సెప్టెంబర్ 21 ఉదయం 11 గంటల నుంచి 24 తేదీ ఉదయం 11 గంటల వరకు దీక్ష చేస్తానని తెలిపారు. 72 గంటల్లో ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు.బాధిత రైతుల కోసం అండగా నేను ఉంటానని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బండ రావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268 లో భూమిని కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలికాలంలో రైతు పోరాట సమితికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కలిసి వినతిపత్రాన్ని అందజేశాంమని..అయినా ఎటువంటి స్పందనా లేదని అందుకే దీక్ష చేపడుతున్నానని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయటానికి 72 గంటలపాటు శాంతియుతంగా దీక్ష చేపడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశా. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకోసం మరోసారి దీక్ష చేస్తానని తెలిపారు.

రైతులు పోరాటాన్ని మధ్యలో ఆపొద్దని… మీకు నేను అండగా ఉంటా.72 గంటల్లో సమస్యలు పరిష్కరించకపోతే అదే దీక్ష అమరణ నిరాహారదీక్షగా మారుతుందని భరోసాఇచ్చారు. భువనగిరి ప్రాంతంలో 32 లక్షల నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం 7 లక్షల 40 వేలు ఇస్తామని ఇప్పటికి ఇవ్వలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్ర