Bharat Jodo Yatra: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయన పటూర్ లోని అకోలా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికి రాహుల్ యాత్ర 70 రోజులు పూర్తి చేసుకుంది. కన్యాకుమారిలో రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Bharat Jodo Yatra: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయన పటూర్ లోని అకోలా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికి రాహుల్ యాత్ర 70 రోజులు పూర్తి చేసుకుంది. కన్యాకుమారిలో రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇప్పటివరకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారు. ఈ నెల 20న రాహుల్‌ గాంధీ పాదయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ హామీలు ఇస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు సిద్ధం అవుతూ రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

అయితే, దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఆయన ఆ పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. దక్షిణాది నుంచి రాహుల్ యాత్ర ఉత్తరాది వైపుగా కొనసాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు రాహుల్ తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా ఈ యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తారని భారత్ జోడో యాత్ర రాజస్థాన్ ఇన్‌ఛార్జి, కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి ఇప్పటికే తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..