Congress Satyagraha Deeksha: సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన.. 4గంటలకు ఎంపీల అత్యవసర భేటీ

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.

Congress Satyagraha Deeksha: సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన.. 4గంటలకు ఎంపీల అత్యవసర భేటీ

Congress

Congress Satyagraha Deeksha: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. కాగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్‌ వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కన్నయ్య కుమార్, మల్లిఖర్జున ఖర్గే, జేడీ శీలం, రణదీప్ సూర్జేవాల, కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ టాక్స్ దర్యాప్తు సంస్థలు బీజేపీ రామ చిలుకలుగా పనిచేస్తున్నాయంటూ దర్యాప్తు సంస్థల బొమ్మలతో నిరసన తెలిపారు. నాలుగో రోజు రాహుల్ ఈడీ ముందు హాజరైన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఎన్నికలున్న రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ టాక్స్ దర్యాప్తు సంస్థలు రెక్కలు గట్టుకుని వాలిపోతాయని, బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తున్నాయంటూ విమర్శలు చేశారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు రాజకీయాలకు దూరంగా స్వంతంత్రంగా పనిచేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

congress: ‘అగ్నిప‌థ్’ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి: రాహుల్‌, ప్రియాంకా గాంధీ

ఇదిలాఉంటే సాయంత్రం 4గంటలకు పార్లమెంట్ భవనంలోని నెం.25లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అత్యవసర సమావేశం కానున్నారు. ఎంపీలంతా సమావేశంకు హాజరుకావాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ సహా దేశంలోని అనేక పక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ తమ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల అత్యవసర సమావేశంలో ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది.