Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 222 మంది నేతలు జంప్

జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ద‌శాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర..

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 222 మంది నేతలు జంప్

Congress

Congress : జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ద‌శాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇంతకీ ఆ పార్టీ ఏదో చెప్పలేదు కదూ. అదే 136 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

గత ఏడేళ్లలో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2014-2021 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 222 మంది (20 శాతం) నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. బీఎస్పీ తర్వాత స్థానంలో ఉంది. ఆ పార్టీకి చెందిన 153 మంది (14 శాతం) ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరారు.

రాజకీయ పార్టీలు మారిన 1133 మందిలో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు 253 మంది (22 శాతం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరినట్లు ఆ నివేదిక తెలిపింది. 2014-21 మధ్య జరిగిన ఎన్నికల్లో గరిష్ఠ సంఖ్యలో 177 మంది (35 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. అదే కాలంలో 33 మంది (7 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారని వివరించింది. పార్టీలు వీడిన నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలిపింది.

Debit Cards : నో నెట్‌వర్క్.. ఆఫ్‌లైన్‌లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!

2014-2021 మధ్య జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మారి పోటీ చేసిన 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 173 మంది (35 శాతం) బీజేపీలో, 61 మంది (12 శాతం) కాంగ్రెస్‌లో, 31 మంది (6 శాతం) తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. 2014 నుండి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు మారి తిరిగి పోటీ చేసిన 1133 మంది అభ్యర్థులు, 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను ADR విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది.

ఈ గణాంకాలు కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రాభవం మసకబారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచే జంపింగ్ లు ఉండటం ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేసే అంశం.