Congress: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. ఈ వారమే రివ్యూ పిటిషన్ దాఖలు

రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిందితులను విడుదల చేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.

Congress: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. ఈ వారమే రివ్యూ పిటిషన్ దాఖలు

Congress: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. మరో 3-4 రోజుల్లో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు

రాజీవ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని శ్రీహరన్, ఆర్పీ రవి చంద్రన్‌తోపాటు మొత్తం ఆరుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 11న ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతోపాటు కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల విడుదలపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రం కూడా సుప్రీంకోర్టులో గతవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు విడుదల చేస్తూ ఇచ్చిన కోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ప్రకటించింది. రాజీవ్ కుటుంబం నిందితుల్ని క్షమించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ క్షమించబోదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

నిందితులకు కోర్టు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, తాజాగా నిందితుల్ని విడుదల చేసింది. 1991 మే, 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. తర్వాత కేసు విచారణలో భాగంగా నిందితులను అరెస్టు చేశారు.