Congress MP: “పెన్ను పోయింది కనిపెట్టండి” కాంగ్రెస్ ఎంపీ కంప్లైంట్

పెన్ను పోయిందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్. తన తండ్రి ఙాపకార్థం ఇచ్చిన పెన్ను పోయిందని, దాని విలువ దాదాపు రూ.లక్షన్నర ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతిపక్ష నేతలు నామినేట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా చెన్నైలోని గిండీలో నక్షత్ర హోటల్‌కు పిలిచారు.

Congress MP: “పెన్ను పోయింది కనిపెట్టండి” కాంగ్రెస్ ఎంపీ కంప్లైంట్

Lost Pen

 

 

Congress MP: పెన్ను పోయిందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్. తన తండ్రి ఙాపకార్థం ఇచ్చిన పెన్ను పోయిందని, దాని విలువ దాదాపు రూ.లక్షన్నర ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతిపక్ష నేతలు నామినేట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా చెన్నైలోని గిండీలో నక్షత్ర హోటల్‌కు పిలిచారు.

కాంగ్రెస్ సభ్యుల సపోర్ట్ కోసం మీటింగ్‌ ఏర్పాటుచేయగా.. అక్కడకు వచ్చిన విజయ్ వసంత్ రూ.1.50లక్షల పెన్ను మిస్ అయింది. తన పెన్ ఎవరో దొంగిలించినట్లు గిండీ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు.

విజయ్ వసంత్ కుమార్ కన్యాకుమారి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన తండ్రి పెన్నునే గుర్తుగా వాడుకుంటున్నారు. ఈ సమయంలో పెన్ను పోవడం షాక్ గా ఉందని ఎంపీ తెలిపారు.

Read Also : న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ కోసం రూ. 20 ఇవ్వాలి…రైల్వే మంత్రికి కంప్లైంట్