Konda Surekha: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: కొండా సురేఖ

మా దంపతుల నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ‘కొండా’ సినిమా తీశాం. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు.

Konda Surekha: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: కొండా సురేఖ

Konda Surekha

Konda Surekha: రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొండా దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘కొండా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి సురేఖ విజయవాడ వచ్చారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఈ సందర్భంగా నేటి రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి ఆమె మాట్లాడారు. ‘‘మా దంపతుల నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ‘కొండా’ సినిమా తీశాం. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. కొండా సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాం. వైఎస్సార్ రాజకీయ భిక్షతోనే మేము ఈ స్థితిలో ఉన్నాం. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసింది లేదు. ఆయనతో మాకు అనుబంధం ఉంది. ఆయన కుటుంబంతో అంత అనుబంధం లేదు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశాక షర్మిలమ్మ, విజయమ్మతో కోర్టుకు హాజరయ్యాను. అప్పుడే వాళ్లతో మాట్లాడాను. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కలిసింది లేదు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నా. టీడీపీ హయాంలోనే మాపై అక్రమ కేసులు పెట్టారు. నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణచి వేస్తున్నారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావు. నక్సలైట్ల హయాంలోనే తెలంగాణ బాగుండేది. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ పార్టీ లాక్కుంది. నక్సల్ ఉద్యమం చేసినప్పుడు ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు’’ అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.