Allahabad HC : మేజర్‌ అమ్మాయి..పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే నేరం కాదు..కానీ అనైతికం

ఒక మేజర్‌ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Allahabad HC : మేజర్‌ అమ్మాయి..పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే నేరం కాదు..కానీ అనైతికం

Consensual Sex

Consensual Sex With Major : ఒక మేజర్‌ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని బాయ్ ఫ్రెండ్ కోర్టును అభ్యర్థిగా..పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రియుడిదేనని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.

Read More : Delhi Air Quality : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం!

గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు.. కుట్టుమిషన్‌ నేర్చుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని బంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు బాధితురాలు అకిల్‌సారాయ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read More : iPhone 13: దీపావళి స్పెషల్ ఆఫర్.. ఐఫోన్‌ 13పై భారీ తగ్గింపు!

ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉందని తెలిపింది. తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యవహారశైలి సందేహాత్మకంగా ఉందని.. అలాగే.. మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేమని హైకోర్టు తెలిపింది. నిందితుడు రాజుకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.