హీరో సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో

  • Published By: naveen ,Published On : June 15, 2020 / 06:35 AM IST
హీరో సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య ఘటన యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తున్న యువ నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ కంటతడి పెడుతున్నారు. ఎంతపని చేశావు సుశాంత్ అని రోదిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. గత 6 నెలలుగా డిప్రెషన్‌లో ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మిస్టరీగా మారింది. సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు:
సుశాంత్ మృతి పట్ల స్పందించిన అతని మేనమామ ఆర్సీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు, హత్య అని ఆయన అన్నారు. సుశాంత్ సింగ్ మృతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదన్నారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని, అత‌ని మృతి వెనుక ఏదో కుట్ర ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు నిజానిజాలను నిగ్గు తేల్చాలన్నారు. కొన్ని రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దానిపైనా ఆయన స్పందించారు. సుశాంత్ మేనేజర్ ది కూడా ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన అన్నారు. ఓ నేషనలిస్టును హత్య చేశారని, సుశాంత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని రాజ్ పుత్ మహాసభ డిమాండ్ చేస్తోందని సింగ్ అన్నారు. 

సుశాంత్ ని హత్య చేశారు:
సుశాంత్ మృతిపై జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని హత్య చేశారని చెప్పారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పాట్నాలోని సుశాంత్ ఇంటి బయట ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిన్న మేనమామ, ఇప్పుడు పప్పు యాదవ్.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసులో మరిన్ని అనుమానాలు పెంచింది.

6 నెలలుగా డిప్రెషన్ లో:
ఆదివారం(జూన్ 14,2020) ముంబైలోని బాంద్రాలో గల తన ఇంట్లో ఉరి వేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముందుగా చూసింది ఇంట్లో పని చేసే వ్యక్తి. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే టనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నాడని, గత 6 నెలలుగా చికిత్స పొందుతున్నాడని, సూసైడ్ కి కారణం అదే కావొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఉరి వేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులోనూ వచ్చింది. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని, సుశాంత్ మృతి వెనక ఏదో కుట్ర ఉండొచ్చని, సుశాంత్ ని హత్య చేశారని పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.