Cop kicks elderly man: వృద్ధుడిని తన్ని తలకిందులుగా వేలాడదీసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

రైల్వే స్టేషన్‌లో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్. విచక్షణారహితంగా కాలితో తన్నుతూ, కొంతదూరం లాక్కెళ్లి, తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Cop kicks elderly man: వృద్ధుడిని తన్ని తలకిందులుగా వేలాడదీసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

Cop Kicks Elderly Man

Cop kicks elderly man: మధ్యప్రదేశ్‌లో వృద్ధుడిపై పోలీస్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రువా జిల్లాలోని జబల్‌పూర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. అక్కడి రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధుడు పోలీసు కానిస్టేబుల్‌తో, అక్కడి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపం తెచ్చుకున్న అనంత్ మిశ్రా అనే కానిస్టేబుల్ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్‌లోనే వృద్ధుడిని తన్నాడు.

Minister KTR: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై కేటీఆర్ ఆగ్రహం.. సస్పెండ్‌కు ఆదేశాలు.. కారణమేమంటే?

ఆ తర్వాత అక్కడ్నుంచి లాక్కుని వెళ్లి, ప్లాట్‌ఫామ్‌పై తలకిందులుగా వేలాడదీశాడు. ఆ తర్వాత కూడా అతడిపై కాలితో చాలాసార్లు తన్నాడు. చుట్టపక్కల ఉన్న వాళ్లెవరూ పోలీసును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే, రైలులో ప్రయాణికుల్లో ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు. తర్వాత ఆ వీడియోను షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దాడికి పాల్పడ్డ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.