Copa America 2021, Final: చరిత్ర సృష్టించిన మెస్సీ.. 28ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అర్జెంటీనా!

లియోనెల్ మెస్సీ సారధ్యంలో అర్జెంటీనా జట్టు కోపా అమెరికా 2021 ఫైనల్‌లో చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడించి అర్జెంటీనా టైటిల్ గెలుచుకుంది.

Copa America 2021, Final: చరిత్ర సృష్టించిన మెస్సీ.. 28ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అర్జెంటీనా!

Messi

Copa America 2021, Final: లియోనెల్ మెస్సీ సారధ్యంలో అర్జెంటీనా జట్టు కోపా అమెరికా 2021 ఫైనల్‌లో చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడించి అర్జెంటీనా టైటిల్ గెలుచుకుంది. అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను ఓడించగా.. 1993 తర్వాత అర్జెంటీనా కోపా అమెరికా టైటిల్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు, లియోనెల్ మెస్సీ(Lionel Messi) కూడా అర్జెంటీనాకు అంతర్జాతీయ వేదికపై తొలిసారి పెద్ద టైటిల్‌ను సాధించడంలో సక్సెస్ అయ్యారు.

మ్యాచ్ ఫస్ట్ నుంచి బ్రెజిల్ మరియు అర్జెంటీనా మధ్య చాలా టైట్ ఫైట్ జరిగింది. కానీ అర్జెంటీనా చివరకు ఒక్క గోల్ సాధించడంతో 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా నిలిచింది. అర్జెంటీనా తరఫున, స్టార్ స్ట్రైకర్ ఏంజెల్ డి మారియా(Angel Di Maria) 22వ నిమిషంలో స్కోరు చేసి జట్టుకు స్కోరు వచ్చేలా చేశాడు. చివరికి ఆ స్కోరే మ్యాచ్ నిర్ణయాత్మకం కావడానికి కారణం అయ్యింది.

బ్రెజిల్ కూడా ఎక్కడా కూడా మ్యాచ్ వదులుకుంది అనిపించలేదు. మ్యాచ్ సమయంలో 60 శాతం బంతిని బ్రెజిల్ తనవైపే ఉంచుకున్నా కూడా.. స్కోరు చేయలేకపోయింది. చివరకు మ్యాచ్‌లో ఓడిపోయింది.

నేరవేరిన మెస్సీ కల:
మెస్సీ ఆధ్వర్యంలో అర్జెంటీనా సాధించిన మొదటి పెద్ద విజయం ఇదే. ఈ విజయంతో, అర్జెంటీనాకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద టైటిల్‌ను అందించాలనే మెస్సీ కల నెరవేరింది. అంతకుముందు, మెస్సీ నాయకత్వంలో, అర్జెంటీనా జట్టు 2014 ప్రపంచ కప్ ఫైనల్లోకి ప్రవేశించగలిగింది. కానీ ప్రపంచ నంబర్ వన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి కల జర్మనీ కారణంగా నెరవేరలేదు.

2014 ఓటమి తరువాత, మెస్సీ పదవీ విరమణ ప్రకటించాడు కూడా.. కానీ అభిమానుల విజ్ఞప్తి మేరకు మెస్సీ తిరిగి మళ్లీ గేమ్ ఆడేందుకు వచ్చాడు. 2018 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా ప్రదర్శన నిరాశపరిచినా,, ఇప్పుడు కోపా అమెరికా ఫైనల్ గెలవడం ద్వారా, చివరకు మెస్సీ అర్జెంటీనాకు ఓ పెద్ద టైటిల్ ఇచ్చినట్లుగా అయ్యింది.