తెలంగాణ‌లో కరోనా..ఒక్క రోజే 269 కేసులు

  • Published By: madhu ,Published On : June 18, 2020 / 12:03 AM IST
తెలంగాణ‌లో కరోనా..ఒక్క రోజే 269 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఇప్ప‌ట్లో వీడ‌డం అనిపించ‌డం లేదు. క్ర‌మ‌క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయి. ప్ర‌ధానంగా జీహెచ్ ఎంసీలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న‌ల క‌లిగిస్తోంది. తాజాగా…2020, జూన్ 17వ తేదీ బుధ‌వారం ఒక్కరోజే 269 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రు మృతి చెందారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డి వారి సంఖ్య 5 వేల 675కి చేరింది. ఇందులో ప్ర‌స్తుతం 2 వేల 412 మంది చికిత్స పొందుతున్నారు. మూడు వేల 71 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 192కి చేరింది. 

2020, జూన్ 17వ తేదీ బుధ‌వారం వేయి 096 కేసులు ప‌రీక్షించారు. అందులో 24.5 శాతం పాజిటివ్ రావ‌డం వైద్యుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్ర‌కారం…దేశ వ్యాప్తంగా..ఇప్ప‌టి వ‌ర‌కు 60.84 ల‌క్ష‌ల న‌మూనాలు ప‌రీక్షించారు. ఇందులో 3.54 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దేశ స‌గ‌టు 5.8 శాతంగా ఉంది. అయితే.. దేశ స‌గ‌టుతో పోలిస్తే రాష్ట్రంలో పాజిటివ్ శాతం రెట్టింపుగా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే…బుధ‌వారం కేసుల సంఖ్య డ‌బుల్ సెంచ‌రీ దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనే 214 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బ న్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగామలో 5, సంగారెడ్డి, మెదక్‌లో 3, వనపర్తి, మేడ్చల్‌ లో 2, ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వికారాబాద్‌ జిల్లా ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు రికార్డ‌య్యాయి. 

క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణించిన 192 మంది ఆరోగ్య ప‌రిస్థితి గ‌మ‌నిస్తే…71 మంది మ‌ధుమేహం, హైప‌ర్ టెన్ష‌న్ ఉన్న‌వాళ్లు ఉన్నార‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. 

Read: అమర జవాన్ సంతోష్ కోసం కంటతడి పెట్టించే పాట