కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 11:38 AM IST
కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం

కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని కనీసం కనికరించడం లేదు.

గుండెనొప్పితో ఓ వృద్దుడి తల్లాడిపోయాడు. సొంతంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి…రోడ్డు పై నడుచుకుంటూ…వస్తూ…కుప్పకూలిపోయాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషాద ఘటన దక్షిణ బెంగళూరులో చోటు చేసుకుంది. 64 వృద్దుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. శుక్రవారం అతడికి గుండెలో నొప్పి వచ్చింది.

వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేశాడు. ఇంటి దగ్గరకు వచ్చి…ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. అంబులెన్స్ కోసం రోడ్డు మీద వెళుతుండగా..మార్గమధ్యంలోనే గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. అందరూ వెళ్లిపోతూనే ఉన్నారు..కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇలా మూడు గంటల పాటు వృద్ధుడి మృతదేహం ఉండిపోయింది.

అంబులెన్స్ అక్కడకు వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లింది. ఈ ఘటనపై బృహన్‌ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)పై విమర్శలు చేస్తున్నారు. సాయంత్రం వర్షాల వల్ల ఆలస్యమయ్యిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్‌-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read:భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు