కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 06:24 AM IST
కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.

అయితే..ఇదిలా ఉంటే..కరోనా వైరస్ మానవత్వాన్ని మంటగలుపుతోంది. కరోనాతో ఎవరైనా చనిపోతే..పట్టించుకొనే వారు కరువవుతున్నారు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందేమోనన్న భయం వారిలో కలుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి. కరోనా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలలో 6 గంటల తర్వాత వైరస్‌ ఉండదని స్పష్టం చేశారు. వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఇబ్బందులు కలుగు చేయవద్దని ప్రజలకు సూచించారు.

ఇక కరోనా వైరస్ ను అడ్డుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, ప్రతి 10 లక్షల మందికి సగటున 18,195 పరీక్షలు చేశామన్నారు. 15 ప్రభుత్వ, 4 ప్రైవేట్‌ కలిపి మొత్తం 19 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెప్పారు.

పరీక్షా ఫలితాలు తెలుసుకొనేందుకు ప్రభుత్వ ల్యాబ్‌లలో 47 ఆర్‌టీపీసీ యంత్రాలు ఉన్నాయన్నారు. కరోనా వైరస్‌తో 9 వేల 096 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న 600 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. పండ్లు, కూరగాయలు అమ్మేవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించినట్లు, 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృతి చెందుతున్నారన్నారు.

Read:ఇండియాలో కరోనాతో మరణించిన 43శాతం రోగుల్లో కొమొర్బిడిటీలు లేవు : ప్రభుత్వ విశ్లేషణ