Hyderabad లో మార్కెట్ లు Close.. ఏ మార్కెట్‌లో తెలుసా

Hyderabad లో మార్కెట్ లు Close.. ఏ మార్కెట్‌లో తెలుసా

గ్రేటర్ హైదరాబాద్ కరోనాతో వణికిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్ కిటకిటలాడుతున్నాయి.

ఎక్కడి నుంచి వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయపడిపోతున్నారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మార్కెట్లు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. షాహినాయత్‌గంజ్, మహారాజ్‌గంజ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, ఉస్మాన్‌గంజ్‌ మార్కెట్లలో పలువురు వ్యాపారులకు కరోనా రావడంతో ఇతర వ్యాపారులు, కస్టమర్లు వణికిపోతున్నారు.

హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ 2020, జూన్ 25వ తేదీ గురువారం సమావేశమయ్యారు. వ్యాపార సంఘాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

బేగంబజార్‌ మార్కెట్‌ను ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు పూర్తిగా మూసేయాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు తమ వ్యాపారాలను మూసి ఉంచాలని వస్త్ర వ్యాపారుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ప్రధానంగా బేగం బజార్ లో ఉన్న హోల్ సేల్ కిరాణ దుకాణాలను స్వచ్చందంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఓల్డ్ సిటీలో పేరొందిన లాడ్ బజార్ మూతపడనుంది.
సికింద్రబాద్ లోని చీరల సేల్స్ కు పేరు గడించిన జనరల్ బజార్ క్లోజ్.
చిత్ర దుర్గ నుంచి మహంకాళీ స్ట్రీట్ వరకు ఉన్న దుకాణాలు జులై 05 వరకు బంద్.
జనరల్ బజార్ లో ఉన్న గోల్డ్ షాప్స్ కూడా బంద్. జులై 05 వరకు క్లోజ్.
Read: కరోనా ఔషధం కొవిఫర్‌ ధర రూ.5,400