Corona in AP: తగ్గని కేసులు.. పూర్తి లాక్ డౌన్ దిశగా ఏపీ!

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. దేశంలో పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Corona in AP: తగ్గని కేసులు.. పూర్తి లాక్ డౌన్ దిశగా ఏపీ!

Corona In Ap Reduced Cases Ap Towards Complete Lock Down

Corona in AP: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. దేశంలో పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఆక్సిజన్ కొరతతో పాటు, అనేక సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తుండగా కేసులు మాత్రం తగ్గడం లేదు.

ఉదయం ఆరు నుండి 12 గంటల వరకు ప్రజలకు అనుమతి ఉండడంతో ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. ఏపీలో రోజుకి 90 వేల నుండి లక్ష టెస్టులు చేస్తున్నట్లుగా ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఈ టెస్టుల ఆధారంగా కరోనా పాజిటివిటీ రేటు 10 కంటే ఎక్కువగా ఉంటే 4 నుండి 6 వారాల పాటుగా లాక్ డౌన్ విధించమని ఐసీఎంఆర్ ఎప్పుడో సూచించింది. కానీ ఏపీలో ఈ పాజిటివిటీ రేపు 20 శాతం మించిపోయింది. పదిశాతం మించని రాష్ట్రాలలో కూడా సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుంది.

ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుండగా ఈ రాష్ట్రాలలో పాజిటివిటీ రేపు పదిశాతం మించలేదు. కానీ ఏపీలో నిర్వహించిన ఫీవర్ సర్వేలో పాజిటివిటీ రేటు ఇరవై శాతం మించడం.. మరోవైపు చాలా గ్రామాలలో ఎక్కువమంది ప్రజలు జ్వరాలతో బాధ పడుతుండడంతో ఇప్పుడు ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలతో ఫలితం లేదని భావిస్తున్న ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సుమారు పదిరోజుల పాటు కఠిన సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తే తప్ప కేసులు అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదని నిఫుణులు భావిస్తున్నారు.