దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 50

  • Published By: naveen ,Published On : May 6, 2020 / 11:34 AM IST
దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 50

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 50 వేల మార్క్‌కు చేరువలో ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 49వేల 400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14వేల 142మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 33వేల 561. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1693.

కరోనా కేసులు, మరణాల వివరాలు:

కరోనా పాజిటివ్ కేసులు: 49400

యాక్టివ్ కేసులు: 33561

డిశ్చార్జ్ అయిన బాధితులు: 14142

కరోనాతో మరణించిన వారి సంఖ్య: 1693

కరోనా మహమ్మారితో భారత దేశం సామూహిక యుద్ధం చేస్తోంది. అయినా వైరస్ లొంగడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న విధంగానే.. గత 24 గంటల్లోనూ కేసుల సంఖ్య అధికంగానే నమోదైంది.

నిన్న మొత్తంగా దేశంలో 2 వేల 958 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా నిన్న ఒక్కరోజే మరణించిన వారి సంఖ్య 126గా ఉంది. ఇది కూడా ఒక్క రోజు  మృతుల సంఖ్యలో రికార్డుస్థాయి మరణాలే కావడం విశేషం. కాగా, కరోనా వైరస్ సోకిన వారిలో రికవరీ రేటు రోజు రోజుకు పెరగడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. నిన్న రికవరీ రేటు 28.71 శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. జోన్ల వారీగా పలు సడలింపులు ఇచ్చారు. 

1

Also Read | కరోనా ఫీజు: రాబడిలేని రాష్ట్రాలు బంగారుబాతును తినేస్తున్నాయా?