భయపడొద్దు : యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికం

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 03:29 AM IST
భయపడొద్దు : యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికం

భారతదేశంలో మొట్టమొదటిసారిగా యాక్టివ్ కేసుల కంటే..రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చూపిస్తున్నాయి. రికవరీ రేటు 48.99 శాతం ఉందని, భారత్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1, 33, 632 కాగా..డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన రోగుల సంఖ్య 1, 35, 206గా ఉందని వెల్లడించింది.

నిర్లక్ష్యం వద్దు : – 
కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి వైరస్ తో ఎలాంటి హానీ జరగడం లేదని, వారంతా బాగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. మిగిలిన 20 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరిపించాల్సిన అవసరం వస్తోందన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమౌతున్నాయన్నారు. కానీ..నిర్లక్ష్యం వద్దని..భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. 

కేసులు అధికం : – 
మరోవైపు కరోనా కేసులు మాత్రం తక్కువ కావడం లేదు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తుండడంతో వైరస్ విస్తరిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 9 వేల 985 కేసులు నమోదు కావడంతో…దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583కి చేరుకుందన్నారు. 279 మంది మరణించడంతో మృతుల సంఖ్య 7 వేల 745కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం వెల్లడించారు. 

ఢిల్లీలో : – 
దేశ రాజధానిలో మాత్రం వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. ఒకే రోజు 1366 కొత్తగా కేసులు వెలుగు చూడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తం కేసుల సంఖ్య 31 వేల 398కి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో కేసులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం ప్రజలు ఢిల్లీకి వస్తే..జూలై 31 నాటికి రాష్ట్రానికి 1.5 లక్షల పడకలు అవసరం అవుతాయన్నారు. 

ముంబాయిలో : – 
ఇక ముంబాయి విషయానికి వస్తే..కేసుల్లో వూహాన్ ని మించి పోయింది. మహారాష్ట్రలో 90 వేల 787 కేసులు నమోదయ్యాయి. ముంబాయిలో 51 వేల కేసులున్నాయి. 

Read: కరోనాకు మందు కనిపెట్టాం.. 100శాతం రికవరీ రేటు: బాబా రామ్‌దేవ్