Corona Second Wave: తారుమారైన సినిమా.. మళ్ళీ అదే పరిస్థితి!

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో లక్షలలో కేసులతో రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను బలి తీసుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి జరుగుతున్నట్లుగా రోజువారీ పాజిటివ్ కేసులే లెక్కలు చెప్తున్నాయి.

Corona Second Wave: తారుమారైన సినిమా.. మళ్ళీ అదే పరిస్థితి!

Corona Second Wave

Corona Second Wave: ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో లక్షలలో కేసులతో రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను బలి తీసుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి జరుగుతున్నట్లుగా రోజువారీ పాజిటివ్ కేసులే లెక్కలు చెప్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలలో ఉన్నట్లుగానే సినిమా రంగంలో కూడా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని మహమ్మారి కమ్మేసింది. హీరోల నుండి అసిస్టెంట్ ల వరకు అందరినీ ఒకేలా చూస్తున్న వైరస్ వరుసబెట్టి ఇళ్లకే పరిమితం చేస్తుంది. దీంతో ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్ ఆపేయగా తీవ్ర జాగ్రత్తల మధ్య కొన్ని బండి లాగిస్తున్నారు.

మరోవైపు వైరస్ వ్యాప్తితో దేశంలో పలు నగరాలలో ఆంక్షలు విధించడంతో థియేటర్స్ మూతపడగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఒకవేళ థియేటర్స్ ఉన్నా ప్రజలు వైరస్ దెబ్బకు థియేటర్స్ కు వచ్చేందుకు భయపడుతున్నారు. అందుకే అన్ని సినిమాలు వాయిదా పర్వం మొదలుపెట్టాయి. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్, తలైవి సినిమాలు వాయిదా పడ్డాయని అధికారిక ప్రకటన రాగా వచ్చే నెలలో విడుదల కావాల్సిన ఆచార్య, బాలకృష్ణ అఖండ, రవితేజ ఖిలాడీ కూడా విడుదల చేస్తారా అన్నది అనుమానమే.

గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో లాక్ డౌన్ దెబ్బకు థియేటర్స్ మూతపడి సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్యాకప్ చెప్పేసింది. సినీ రంగాన్ని నమ్ముకున్న ఎందరో అష్టకష్టాలు పడి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొత్త ఏడాదిలో మళ్ళీ ధైర్యం చేసి ఇండస్ట్రీ కొత్త సినిమాలను మొదలుపెట్టగా మహమ్మారి మరోమారు విజృంభణ కొనసాగిస్తుంది. దీంతో ఏడాదికి మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. సెకండ్ వేవ్ విజృంభణ మే నెలాఖరు వరకు ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తుండగా మరో రెండు వారాలలో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. మరి సినీ పరిశ్రమ ఈ గండాన్ని ఎలా తట్టుకుంటుందో చూడాల్సి ఉంది.