తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా

తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా

Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్‌. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు వ్యాక్సిన్‌ రవాణా జరుగుతోంది. జనవరి 16న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 934 కేంద్రాల్లో ఈ టీకాలను అందించనున్నారు.

దేశవ్యాప్తంగా నిర్దేశించిన 12 ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను తరలించారు. కోటి 65 లక్షల డోసులను ప్రభుత్వం సేకరించింది. వీటిలో కోటి పది లక్షల డోసులు కొవిషీల్డ్‌వి కాగా, మరో 55లక్షల డోసులను భారత్‌ బయోటెక్‌ అందించింది..
తెలంగాణలో ప్రైవేట్‌ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని నిర్ణయించారు. తొలిరోజు 55 వేల 270 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. తెలంగాణలో తొలి వ్యాక్సిన్‌ను గాంధీ ఆసుపత్రిలో ఒక పారిశుధ్య కార్మికునికి ఇవ్వనున్నారు.

ఇక ఏపీకి చేరుకున్న వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలకు రవాణా చేస్తున్నారు. ముందుగా 3 లక్షల 80వేల మందికి పైగా ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇస్తామని అధికారులు తెలిపారు.. మొత్తం 332 సెషన్‌ సైట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే.. అన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ మొదలవుతుంది.