కరోనా దెబ్బ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు ?

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 12:38 AM IST
కరోనా దెబ్బ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు ?

తెలంగాణలో కరోనా వైరస్ ధాటికి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని…ప్రముఖులకు సైతం కష్టాలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు..ఇలా ప్రతొక్కరూ…ఈ వైరస్ కారణంగా..అష్టకష్టాలు పడుతున్నారు.

ఇందులో విద్యా వ్యవస్థ గురించి చెప్పుకోవాలి. కరోనా విస్తరిస్తున్న క్రమంలో…స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో జరగాల్సిన కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందస్తు జాగ్రత్తలో భాగంగా…పదో తరగతి ఎగ్జామ్స్ అయితే..ఏకంగా రద్దు చేసింది తెలంగాణ సర్కార్. మరి డిగ్రీ పరీక్షలు ? 2019-20 విద్యా సంవత్సరం డిగ్రీ పరీక్షలను నిర్వహిస్తారా ? లేదా ? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. 

అయితే..ప్రస్తుతం నగరంలో కరోనా కోరలు చాస్తోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో..పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020, జూన్ 19వ తేదీ గురువారం…ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో…ఉన్నత విద్యాధికారులు, ఇతరులు పాల్గొన్నారు. పరీక్షలను రద్దు చేస్తే బెటర్ అనే అభిప్రాయాలకు వచ్చినట్లు సమాచారం. 

ఫస్ట్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తే బాగుంటుందనే చర్చించినట్లు తెలుస్తోంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం…సెప్టెంబర్ 01 నుంచి డిగ్రీ ఫస్టియర్, ఆగస్టు 15 నుంచి సెకండియర్, ఫైనల్ ఇయర్ తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీలో ఐదు సెమిస్టర్లు పూర్తయ్యాయని, ఇంటర్నల్ మార్కులు కూడా ఉన్నాయని..వాటి సగటు లెక్కించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయాలని ప్రతిపాదించారు. మొత్తంగా…ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపాకే..అమలు చేయనున్నారు. 

Read: తెలంగాణలో కరోనాను జయించిన 88 ఏళ్ల వృద్ధుడు