COVID-19 cases: దేశంలో 7,175కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

 దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,175కి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,67,311కు చేరిందని తెలిపింది.

COVID-19 cases: దేశంలో 7,175కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

India's Active caseload

COVID-19 cases: దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,175కి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,67,311కు చేరిందని తెలిపింది.

నిన్న దేశంలో కరోనా వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో తొమ్మిది మంది కేరళకు చెందినవారే ఉన్నారని వివరించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,30,546కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.02 శాతం ఉన్నట్లు తెలిపింది. కొవిడ్ రికవరీ రేటు 98.79 శాతం ఉన్నట్లు చెప్పింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,41,29,590 మంది కోలుకున్నారని తెలిపింది. భారత్ లో ఇప్పటివరకు మొత్తం కలిపి 219.83 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది. నిన్న 1,19,851 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. నిన్న దేశంలో 1,47,344 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..