Coronavirus Alert : కరోనాపై అలర్ట్‌.. భారత్‌ను భయపెడుతున్న వైరస్

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 93 వేల 249 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ 19 తెర్వాత ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

Coronavirus Alert : కరోనాపై అలర్ట్‌.. భారత్‌ను భయపెడుతున్న వైరస్

Coronavirus Alert Second Wave Of Covid 19 Spreading Fast India

Coronavirus Alert : భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 93 వేల 249 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ 19 తెర్వాత ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంటే 198 రోజుల తర్వాత ఈ రేంజ్‌లో కేసులో రికార్డయ్యాయి. కరోనాతో 513 మంది చనిపోయారు. 120రోజుల తర్వాత అత్యధిక మరణాలు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్‌ మొదటిస్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌ను బీట్‌ చేసి పడేసింది. ఐదు నెలల తర్వాత అమెరిక, బ్రెజిల్‌ను దాటి భారత్‌లో కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తి దేశంలో ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 49 వేల 447 కేసులు వచ్చాయి.

గతేడాది కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 277 మంది కరోనాతో చనిపోయారు. గతేడాది అక్టోబర్‌ 16 తర్వాత ఇన్ని మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. ఒక్క మహారాష్ట్రాలోనే 4 లక్షల పైగా యాక్టివ్ కేసులున్నాయి. అటు మహారాష్ట్ర రాజధాని ముంబైలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే 9 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోనే భారీగా కేసులు రికార్డవుతున్నాయి. ఒక్కరోజే 5 వేల 818 కేసులు బయటపడ్డాయి.

అక్కడ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాలు కూడా సరిపోని హృదయ విదారక పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజూ కోవిడ్ మరణాలతో ఆస్పత్రి మార్చురీలలో శవాలు పేరుకుపోతున్నాయి. వాటికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల సామర్థ్యం సరిపోవడం లేదు. దుర్గ్ జిల్లాలో ఈ పరిస్థితి మరింత దాపురించింది. కొత్త కేసులు సంఖ్య అక్కడ వెయ్యి దాటింది. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు లాక్‌డౌన్ విధించింది. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనుంది.