భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : May 16, 2020 / 05:10 AM IST
భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు

భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార్కును దాటినట్లు అయ్యింది.

అయితే అందులో 30,152 మంది మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నారు. చనిపోయినవారి సంఖ్య 2,752గా ఉంది, అత్యధిక మరణాలు మహారాష్ట్ర (1068) నుంచి నమోదయ్యాయి. దీంతో భారత్‌ చైనా సంఖ్యను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ మరణాలు అమెరికా కలిగి ఉండగా, 85,000 కేసులతో భారతదేశం, చైనా సంఖ్యను కూడా దాటింది. 

భారతదేశం కంటే ఎక్కువ కేసులు ఉన్న పది దేశాలు.. యునైటెడ్ స్టేట్స్ , రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ , ఇటలీ , బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ మరియు ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4.5 మిలియన్లు దాటింది. వారిలో 3 లక్షలకు పైగా చనిపోయారు. 

దక్షిణాది నుంచి టాప్‌లో తమిళనాడు:
ఇక దక్షిణాది నుంచి తమిళనాడులో కేసులు విపరీతంగ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 10వేల కరోనా కేసులు దాటాయి. చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వ్యాప్తికి కేంద్రబిందువు అవగా.. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,108కి చేరుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో కేసులు:
తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్-19 కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. తెలంగాణలో కొత్తగా 40 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1454కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 102పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 2307కి చేరకుంది.

Graph

 

Read Here>> భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు