CoronaVirus Updates:లైవ్ బ్లాగ్: కరోనా సునామీ విలయం

CoronaVirus Updates:లైవ్ బ్లాగ్: కరోనా సునామీ విలయం

Coronavirus Live Updates

ఫస్ట్ టైమ్ తెలంగాణలో.. భారీగా కరోనా కేసులు నమోదు..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఇదే సమయంలో కరోనాతో రాష్ట్రంలో పన్నెండు మంది చనిపోయారు. కరోనా నుంచి గడిచిన 24గంటల్లో 1,414 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌‌గా ఉన్న కేసుల సంఖ్య 33,514కి చేరుకుంతి. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 598 కేసులు నమోదయ్యాయి.

కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత. వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 5,892 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

Reazul

Reazul

కాగా, కరోనా బారిన పడిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురువారం ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సమ్సేర్‌గంజ్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన రిజావుల్ హక్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన రిజావుల్ హక్‌ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇంకా నాలుగు దశల పోలింగ్ జరగాల్సివుంది. సమ్సేర్‌గంజ్ నియోజవర్గానికి ఏప్రిల్-17న పోలింగ్ జరగనుంది.గతం కంటే ప్రమాదంగా కరోనా.. కొత్త లక్షణాలు ఇవే!

Few symptoms of covid 19: కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టేస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా.. ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిపోతుంది. ఇదిలా ఉంటే సెకెండ్ వేవ్‌లో కొవిడ్‌ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే పాజిటివ్‌ వస్తోందని వెల్లడించారు.