ఆన్ లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాలు

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 05:27 AM IST
ఆన్ లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ స్కూల్స్ అధిక ఫీజుల దందాలు

ఒక వైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగూ జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరో వైపు కార్పొరేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దందాలు చేస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్ కు మొబైల్స్ లో మెసేజ్ లు పెడుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు అవీ ఇవీ అంటూ తల్లిదండ్రుల నుంచి అందినకాడికి డబ్బులుదండుకుంటున్నాయి కొర్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు.

 

కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు అభివృద్ధి అటకెక్కింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి పలు విద్యాసంస్థలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబందనలను ఉల్లంఘించి క్లాసులునిర్వహిస్తున్నాయి మరికొన్ని విద్యా సంస్థలు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూఇప్పటికే కొన్ని చాప్టర్లు కూడా కంప్లీట్ చేసేశాయి.ఇలా నిబంధనలకు తిలోదకాలిస్తూ..అధిక ఫీజల్ని వసూలు చేస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసులు మిస్ అయితే మరోసారి చెప్పేది లేదనీ..విద్యార్ధులను వారి తల్లిదండ్రులను బెదిరిస్తూ ఫీజులు దండుకుంటున్నాయి.

 

లాక్ డౌన్ తో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే… వేలల్లో ఫీజులు ఎలా చెల్లించాలని విద్యార్దుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ… స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

 

అంతేకాదు ఆన్ లైన్ క్లాసుల కారణంగా తమ పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఆన్ లైన్ క్లాసుల సమయాన్ని తగ్గించి… ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read: పచ్చని కాపురాల్లో కరోనా చిచ్చు… కూలుతున్న కుటుంబాలు