Yashwant Sinha: దేశానికి సైలెంట్ ప్రెసిడెంట్ కాదు కావాల్సింది – యశ్వంత్ సిన్హా

ఉమ్మడి ప్రతిపక్ష ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. దేశానికి ఇప్పుడు కావాల్సింది సైలంట్ ప్రెసిడెంట్ కాదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

Yashwant Sinha: దేశానికి సైలెంట్ ప్రెసిడెంట్ కాదు కావాల్సింది – యశ్వంత్ సిన్హా

Yashwanth

Yashwant Sinha: ఉమ్మడి ప్రతిపక్ష ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. దేశానికి ఇప్పుడు కావాల్సింది సైలంట్ ప్రెసిడెంట్ కాదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు కోరేందుకు చండీఘడ్ వెళ్లిన సిన్హా, తాను ఎన్నికైతే ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు.

పరిపాలన, ప్రజా జీవితంలో 60 ఏళ్లు గడిపానని, ఇప్పుడు చూస్తున్నంత బీభత్సాన్ని ప్రభుత్వ సంస్థలలో ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించాలని తామెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇప్పుడు, ఏజెన్సీలను మాజీ కేంద్ర మంత్రులు దుర్వినియోగం చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు.

Read Also : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని కొందరు శివసేన ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రేపై ఒత్తిడి తెస్తున్నారని వెలిబుచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికలలో గెలిస్తే, రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగంలోని అత్యున్నత స్థానం “ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఇలాంటివి ఆగిపోతాయి” అని సిన్హా అన్నారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనను ప్రస్తావిస్తూ, ఏకాభిప్రాయంపై ఆధారపడిన రాజకీయాలు ఇప్పుడు ముగిశాయని సూచించారు. ఇప్పుడు వివాద రాజకీయాలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి పేర్కొన్నారు.