గిప్ట్ చూసి షాకైన వధూ వరులు, ఏ బహుమతి ఇచ్చారో తెలుసా

గిప్ట్ చూసి షాకైన వధూ వరులు, ఏ బహుమతి ఇచ్చారో తెలుసా

Wedding Gift : ఏదైనా శుభకార్యానికి పిలిస్తే..గిఫ్ట్ లు తీసుకెళ్లడం కామన్. ఈ బహుమతుల విషయంలో..తోచిన విధంగా ఇస్తుంటారు. కొందరు క్యాష్ ఇస్తే..మరికొంతమంది దుస్తులు, వస్తువులు, ఇతరత్రా వాటిని ఇస్తారు. కానీ..ఓ స్నేహితుడి వివాహానికి హాజరైన తోటి ఫ్రెండ్స్ వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చారు. మాములు బహుమతిని ఇస్తే..తమ స్పెషాల్టీ ఏముంటుందిలే..అని భావించి..విలువైన వస్తువు ఇవ్వాలని అనుకున్నారు. వారు ఇచ్చింది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి చెందిన కార్తీక్, శరణ్య వివాహ వేడుక వంగరలోని ఓ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ పెళ్లికి వధూ, వరుల కుటుంబాలు, స్నేహితులు హాజరయ్యారు. మిత్రుడికి ఇవ్వబోయే పెళ్లి కానుక గురించి ముందే ఆలోచించుకున్నారు. పది మందిలో తమది ప్రత్యేకంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. సామాన్య జనాన్ని భయపెడుతున్న, ఆందోళన కలిగిస్తున్న అంశంపై చర్చించారు. ఠక్కున గ్యాస్, పెట్రోల్ రేట్లు గుర్తుకొచ్చాయి. అంతే…వాటినే గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. ఓ గ్యాస్ సిలిండర్ ను, ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్ ను నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారు. ఇదే సమయంలో ఉల్లిపాయలతో చేసిన దండను వధూవరులకు ఇచ్చారు. వాటిని వారు నవ్వుకుంటూ..వేసుకున్నారు. ఇక పెళ్లికి వచ్చిన వారంతా ఇది చూసి అవాక్కయ్యారు.

వాస్తవానికి పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏకంగా లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు చేరుకుంది. 2021, ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్ పై 33 పైసలు చొప్పున పెరిగాయి. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రికార్డు స్థాయి ధర నమోదైంది. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 80.60కు చేరింది. రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100.25 దాటింది.