నీటిలో శవాల్లా తేలుతూ.. పెళ్లి జంట ఫొటోషూట్ : శుభమాని పెళ్లిచేసుకోబోతూ ఈ చావు వేషాలేంటిరా బాబూ..

నీటిలో శవాల్లా తేలుతూ.. పెళ్లి జంట ఫొటోషూట్ : శుభమాని పెళ్లిచేసుకోబోతూ ఈ చావు వేషాలేంటిరా బాబూ..

pre-wedding photo shoot lovers suicide : నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న జంట..పెళ్లిలోనూ వీడని బంధం..తీరానికి కొట్టుకొచ్చారు. అక్కడ నీటిలో తేలుతున్న జంటను ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్‌లో ఫొటోలు తీస్తున్నారు. అక్కడి వాతావరణం అంతా హడావిడి హడావిడిగా ఉంది. ఫోటో గ్రాఫర్లు ఫ్లాష్ ఫ్లాష్ మంటూ ఫోటో తీసేస్తున్నారు. ఫోటోలు సూపర్ గా వచ్చాయ్..భలే భలే అంటున్నారు. కానీ అప్పుడే ఓ షాకింగ్ ఘటన జరిగింది..అప్పటి వరకు శవాల్లా నీటితో ఉన్న జంట సడెన్ గా లేచింది…!! ఏంటీ షాక్ అయ్యారా? అప్పుడే ఏముంది? అసలు విషయం తెలిస్తే వాళ్లు తిట్టిపోస్తారు.

అలా నీటిలో శవాల్లా తేలుతూ ఉన్న జంటకు ఇంకా పెళ్లికాలేదు. అది వారి పెళ్లి ఫోటో షూట్..! అప్పటి వరకూ శవాల్లా పడుకున్న ఉణ్న ఆ జంట ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. అది ప్రీ-వెడ్డింగ్ ఫొటో‌షూట్ అని అర్థమయ్యే ఉంటుంది కదూ..దీనికి సంబంధించిన ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..ఇది చూసినవారంతా ‘‘శుభమాని పెళ్లి చేసుకుంటూ శవాల్లా పడుకోవటమేంటీ? ఇదేం పోయేకాలం‘‘అని తిట్టిపోస్తున్నారు..

ఈ కరోనా సమయంలో పెళ్లి ఎలా చేసుకున్నా ప్రీ-వెడ్డింగ్ షూట్ మాత్రం అదిరిపోయేలా చేసుకోవాలనుకుంటున్నారు నేటి యువత. ఆ ఫొటోలు సరికొత్తగా ఉండాలి. ఎవరు ఇలా చేసినట్లుగా ఉండకూడదు. అవి తమ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటు..ఇటువంటి షూట్ లు చేయించుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మరీ చేయించుకంటున్నారు. దీంతో ఫొటోగ్రాఫర్లు రకరకాల థీమ్స్‌లో ఫొటోషూట్ చేస్తున్నారు.

ఓ నదీ తీరంలో ఓ జంట నీటిపై తెలుతూ కనిపించింది. నీటిలో కొట్టుకొస్తుండగా..వారికి తీగలు..పుల్లలు చుట్టుకున్నట్లుగా కూడా నాచ్యురల్ గా ఉండేలా చూసుకున్నారు. వారిని చూస్తే.. ఇద్దరు ఒకరినొకరు తాడుతో కట్టేసుకుని.. ఒకేసారి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని.. ఇలా ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లుగా ఉంది. కట్.. చేస్తే, ఇదంతా కాబోయే పెళ్లి జంట ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్. ‘లవర్స్ సూసైడ్’ థీమ్‌లో ఈ ఫొటోలు తీస్తున్నారు. ఈ ఫొటోషూట్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం శుభమాంటూ త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతూ…ఈ వేషాలేంటీ? ఈ పిచ్చి పిచ్చి ఐడియాలేంటీ? అంటూ నెటిజనులు తిట్టిపోస్తున్నారు. క్రియేటివిటీ మరీ పీక్స్ లో ఉందే అంటున్నారు. కొందరి మాత్రం ఇటువంటి ఐడియా ఫొటో షూట్.. ‘నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటున్నారు. మరి మీరు ఏమంటారు? పిచ్చి పీక్స్ అంటారా? క్రియేటివిటీ అంటారా? లేకపోతే వీళ్ల మొహాలు మండా ఈ వెర్రి వేషాలేంటీ అని తిడతారా?