Maharashtra : పాపులారిటీ కోసం ఇంత బరితెగింపా? ట్రాఫిక్‌లో స్కూటర్‌పై స్నానం చేసిన జంట

చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు చేసే పనులతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట స్కూటర్‌పై స్నానం చేసి వైరల్ అవ్వాలనుకున్నారు. వీరు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Maharashtra : పాపులారిటీ కోసం ఇంత బరితెగింపా? ట్రాఫిక్‌లో స్కూటర్‌పై స్నానం చేసిన జంట

Maharashtra

couple bathing on a scooter in traffic : సోషల్ మీడియాలో నిత్యం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ కొందరు వీడియోలు పోస్టు చేస్తున్నారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే కొందరు పరువు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట రోడ్డు మధ్యలో స్కూటర్‌పై స్నానం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు.

Maharashtra : మహారాష్ట్రలో మరోసారి రెచ్చిపోయిన కొడవళ్ల గ్యాంగ్.. మెడికల్ షాప్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి

మహారాష్ట్ర థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ జంట స్కూటర్‌పై ఉన్నారు. యువతి తనతో తెచ్చుకున్న బకెట్‌లోని నీటిని మగ్‌తో తీసి తన మీద .. బైక్ నడుపుతున్న వ్యక్తి మీద పోస్తూనే ఉంది. అక్కడ ఆగి ఉన్నవారంతా వీరి వింత చర్యను ఆశ్చర్యంగా చూసారు. కొందరు నవ్వుకున్నారు. ఇక సిగ్నల్ దాటుతూ కూడా ఆ యువతి అతనిపై తనపై నీళ్లు పోస్తూ స్నానం చేస్తూ ముందుకు సాగారు.

 

WeDeserveBetterGovt అనే ట్విట్టర్ యూజర్ థానే పోలీసులకు ఈ ఘటన గురించి ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ‘ఈ ఘటన ఉల్హాస్‌నగర్ సెక్షన్-17 మెయిన్ సిగ్నల్‌లో జరిగింది, సరదా పేరుతో చేసే ఇలాంటి పనికిమాలిన పనులకు అనుమతి ఇస్తారా? పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించే ఇలాంటి పనులు ఇతరులు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అనే శీర్షికతో షేర్ చేశారు.

Maharashtra: థానేలో దారుణ ఘటన.. విద్యార్థినిని వేదింపులకు గురిచేసి ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. వీడియో వైరల్

దీనిపై థానే సిటీ పోలీసులు స్పందిస్తూ ఈ ఘటన వివరాలు స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఫార్వార్డ్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ వీడియోలోని వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లాగా తెలుస్తోంది. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలనే నిబంధనను పాటించనందుకు తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ముంబై పోలీసులకు క్షమాపణలు చెప్పాడు. అందుకు జరిమానా చెల్లిస్తానని తెలిపాడు. తనను అరెస్టు చేసినట్లు వస్తున్నవార్తలు అసత్యమని.. అలాంటి వార్తలు ప్రచారం చేయద్దని కోరాడు. అయితే ఈ జంటపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.