Pre-wedding shoot with Snake : పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్.. ‘నాగ్ నే బనా దీ జోడీ’ అంటున్న నెటిజన్లు

పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్‌తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్‌గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.

Pre-wedding shoot with Snake : పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్.. ‘నాగ్ నే బనా దీ జోడీ’ అంటున్న నెటిజన్లు

pre-wedding photoshoot

Viral Video : ఇటీవల కాలంలో వెరైటీ ప్రీ-వెడ్డింగ్ షూట్ లతో జంటలు తెగ వైరల్ అవుతున్నారు. కొన్ని విమర్శల పాలవుతుంటే కొన్ని అందంగా ఉంటున్నాయి. రీసెంట్ గా పాముతో ఓ పెళ్లికాబోయే జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ వైరల్ అవుతుంది. పాము వల్ల వీరి ప్రేమ కథ మొదలైనట్లుగా ఈ జంట క్రియేట్ చేసిన లవ్ స్టోరి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘నాగ్ నే బనా ది జోడి’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

wedding Dress Guinness Record : వరల్డ్ రికార్డు సాధించిన వెడ్డింగ్ డ్రెస్ .. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా

పెళ్లికంటే ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఫేమస్ అయిపోయాయి. క్రియేటివ్ గా ఆలోచిస్తూ జంటలు రకరకాలుగా ఫోటో షూట్ చేస్తున్నారు. అయితే పాముతో ఓ జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ వైరల్ అవుతోంది. vivekk అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పోస్టులో కొన్ని ఫోటోల థ్రెడ్ ను పంచుకున్నారు. దీనిని బట్టి చూస్తే పాము కారణంగా ఈ జంట ప్రేమలో ఎలా పడ్డారో ఫోటో షూట్ వల్ల తెలుస్తోంది.

 

లేడీ తన ఇంటి బయట ఒక పాముని చూస్తుంది. వెంటనే రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేస్తుంది. వెంటనే ఇద్దరు స్కూటర్ పై అక్కడికి చేరుకుంటారు. అలా వారిలో ఒకరితో ఫోన్ లో మాట్లాడుకోవడం ద్వారా ప్రేమ కథ మొదలైంది. చివరి ఫోటోలో పాము తమవైపు చూస్తున్నప్పుడు జంట చేయి చేయి కలిపి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: వెడ్డింగ్ ఫొటో షూట్‌లోకి దూసుకొచ్చిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే.. ఆసక్తికర వీడియో

‘నాగ్ నే బనా దీ జోడీ’ అని ఒకరు.. ‘షార్ట్ మూవీస్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ చేయాలి’ అని మరొకరు చత్కరించారు. ఇక ‘బెస్ట్ ప్రీ-వెడ్డింగ్ షూట్’ గా నెటిజన్లు మెచ్చుకున్నారు. అంతా బాగా జరిగింది కాబట్టి సరే.. లేదంటే అక్కడ ఉన్నది పాము.. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కథ వేరేలా ఉండేది. ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన ఫోటో షూట్లు చేసేటపుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే.